మహిళలను సన్మానించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నపూర్ణ దంపతులు
ఇల్లందు ప్రతినిధి మార్చి 8 (ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కామేపల్లి మండలం పందితాపురం లో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అంగన్వాడీ మహిళలకు ఆశా వర్కర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ స్త్రీ దేవునికి ప్రతిరూపంగా కనిపించని దేవత కంటే కనపడే అమ్మ గొప్పదని, ఒక స్త్రీ ఒక భార్య లాగా ఒక తల్లి లాగా ఒక చెల్లి లాగా తన ఇంటికి సమాజానికి వెలుగులను పంచుతున్న స్త్రీమూర్తులను గౌరవించుకోవడం మన సాంప్రదాయమని స్త్రీని అవమానించడం వలన మహాభారత యుద్ధం జరిగిందని రావణాసురుని వద జరిగిందని, అలాంటి స్త్రీమూర్తులని గౌరవించుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సహజంగా స్త్రీకి సహనం, మానవత్వం, ఓర్పు పురుషుడి కంటే చాలా ఎక్కువని, ఆనాడు మొదట దేవతా మూర్తులకే భగవంతుడు ప్రాధాన్యమిచ్చాడని, అందుకే ముందు మనమంతా లక్ష్మీనారాయణ, పార్వతి పరమేశ్వరులు, రాధాకృష్ణులు అనిపించుకుంటాము. ఈనాడు మహిళలు క్రీడలలో రాజకీయాలలో సాంకేతిక రంగాలలోఉద్యోగ బాధ్యతలలో ఒక్కటేమిటి అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, పురుషులకు దీటుగా విజయం సాధిస్తున్నారని అభివర్ణించారు. ఇంకా మన దేశం లో స్త్రీలకు రక్షణ లేకపోవడం చాలా దురదృష్టకరమని, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని దానిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రాబోయే రోజులలో 33% రిజర్వేషన్ కల్పించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది తెలిపారు ఈ కార్యక్రమం లో ఆదిలక్ష్మి నాగ, బసవమ్మ వెంకటమ్మ, సొందుబి, లక్ష్మి, ప్రమీల, దర్గా, రామలక్ష్మి, అరుణ, కవిత, అంజమ్మ నాగమణి, రత్న, కమల, ఆరోగ్యం, మంగతాయి అన్నపూర్ణ, ధనలక్ష్మి, నీల, మరియు గ్రామ పెద్దలు బానోతు నరసింహ నాయక్ శీలం పుల్లయ్య మేకల మల్లికార్జునరావు, బాదావత్ నాగరాజు, జక్కంపూడి వెంకటేశ్వర్లు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు
