మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

 

– హెచ్,ఎం,ఓ,ను సన్మానించిన ఉపాధ్యాయినీలు

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 8 ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: అల్లాదుర్గం మండలంలోని ముప్పారం ప్రభుత్వ పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా యుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, నాగలక్ష్మి,మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మిని, తమ తోటి ఉపాధ్యాయినీలు, శాలువాతో సత్కరించారు, ఈ సందర్భంగా నాగలక్ష్మి, రమాదేవిలు, మాట్లాడుతూ ఉన్నత స్థాయిలో మహిళలు రాణించడం అభినందనీయమని, ప్రతి బాలిక విద్యను అందుకునేలా ప్రతి కుటుంబ సభ్యులు, చొరవ తీసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రమాదేవి,, ఎస్ఎంసి, చైర్మన్ జయమ్మ, అటెండర్ ఆగమ్మ,అంగన్వాడి ఆయమ్మ మొగులాంబి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking