ఖమ్మం ప్రతినిధి మార్చి 8 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గల 10 వ డివిజన్ చైతన్య నగర్ ఎన్టీఆర్ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ( అయ్యప్ప స్వామి ) దేవాలయంలో అయ్యప్ప స్వామి విఘ్నేశ్వర స్వామి నాగరాజు స్వామి సుబ్రహ్మణ్యస్వామి మరియు మాలికాపురత్తమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈనెల 16వ తారీకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్యలో కేరళ వాస్తవ్యులు తంత్రి బ్రహ్మశ్రీ తక్కే కోరమంగళం దామోదరన్ నంబూద్రి మరియు ఆరాధ్య గురుదేవులు బ్రహ్మశ్రీ పాకతిల్లం నారాయణన్ నంబూద్రి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మేకల హనుమంతరావు తెలిపారు ఈనెల 17 న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ధ్వజస్తంభము మరియు పదునెట్టాంబడుల ప్రాణ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 18న కడుత్త స్వామి కరుప్ప స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ చావా మాధురి నారాయణరావు 11 డివిజన్ కార్పొరేటర్ సరిపుడి రమా సతీష్ దేవాలయం ట్రస్టు సభ్యులు వెంపటి సత్యనారాయణ అట్లూరి మధు ఆలస్యం నారాయణరావు టి వి పుల్లంరాజు సరిపుడి నాగేశ్వరరావు వేజెండ్ల రవీంద్రబాబు మరియు టెక్నికల్ ఇంజనీర్ నల్లమల సత్యంబాబు పాల్గొన్నారు