హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి మార్చ్ 8
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ నందు బ్రాంచ్ చైర్మన్ డి.రాజేశ్వర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళలకు మహిళా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాబోయే కాలంలో స్త్రీలందరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని జ్ఞానవంతులు కావాలని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కే రాధమ్మ టి లక్ష్మి జీడి కొమరమ్మ పోచమ్మ రాధమ్మ లను పూలమాలలతో సత్కరించారు.ఈ సమావేశానికి పెరగా,చంద్రయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ లు విద్యాసాగర్,ఖాదర్ ఖాన్, సీనియర్ నాయకులు టి వెంకటస్వామి,మొయినుద్దీన్, బి సమ్మయ్య,కాజా మొయినుద్దీన్, పరశురాములు,ఎస్ రాజయ్య, ఎస్ పోశయ్య,సోమయ్య మహిళా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.