ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చ్08:
తార్నాక నారాయణ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఏఎస్ కే కిరణ్మయి, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మాధురి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో, ఉన్నత స్థానాలలో ఉంటూరాన్నారు. అటు గృహిణిగా, ఇటు వృత్తి పరంగా రాణిస్తురాన్నారు. క్రీడా రంగాలలో కూడా ముందంజలో ఉంటున్నారు. ఒక మహిళ ఇవన్నీ సాధించాలంటే ఇంట్లో వారి ప్రోత్సాహం ఎంతో అవసరం అన్నారు. అలా ఉన్నప్పుడే ప్రతి మహిళ దేన్నైనా సాధించగలదని తెలిపారు. అనంతరం అతిథులను పాఠశాల యాజమాన్యం సన్మానించింది. ఈ కార్యక్రమంలో
పాఠశాల ప్రిన్సిపాల్ పర్వేన్, ఈ- చాంప్స్ కో ఆర్డినేటర్ లక్ష్మీ భవాని, ఈ- కిడ్జ్ కో- ఆర్డినేటర్ నూర్, ఈ చాంప్స్ సరిత, ఈ-కిడ్జ్ షాహీన్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు