మహిళా దినోత్సవం సందర్బంగా ఏఎంఆర్ ప్లానెట్ ఆద్వర్యం మహిళలు బైక్ ర్యాలి

హైదరాబాద్ మార్చ్ 13 :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని ఏఎంఆర్ ప్లానెట్ ఆద్వర్యం లో 30 మంది మహిళా బైకర్లు ర్యాలీని నిర్వహించారు.ఈ ర్యాలి ఐడియల్ మల్టిప్లెక్స్ డైరెక్టర్ రాకేష్ కుమార్ ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంబించారు. బైకర్లు తీసుకున్న 50 కి.మీ మార్గం ఏఎంఆర్ ప్లానెట్ వద్ద బయలుదేరింది మరియు ఇసిఐఎల్, సైనిక్‌పురి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, షామీర్‌పేట మీదుగా కొండ పోచమ్మ రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న శ్రావ్య టెక్స్‌టైల్ తయారీ కేంద్రానికి వెళ్లింది.ఈ సందర్బంగా ఐడియల్ మల్టిప్లెక్స్ డైరెక్టర్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు మహిళలు ముందుండి బైకింగ్ మరియు ర్యాలీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలు కుడా పురుషులకు తెసిపోరనడానికి నిదర్శ్జనమని,మహిళల ర్యాలీ మా కృతజ్ఞతలు అని అన్నారు. భవిష్యత్తులో.”ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆశించారు.60 మందికి పైగా బైకర్లు పూర్తి భద్రతతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరియు ఏఎంఆర్ ప్లానెట్ డైరెక్టర్లు రాకేష్ రెడ్డి మరియు అనంత్ గౌడ్ లు ఫ్లాగ్ ఆఫ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking