రాజన్న సిరిసిల్ల జిల్లా 13, మార్చి 2023 ప్రజాబలం ప్రతినిధి
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి Jవస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 24 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
Revenue – 11
Empolyment – 1
LDM – 1
DPO – 2
DWO – 1
ED Sc Corporation – 1
SP – 1
MPDO Chandurthi -1
EE Package(9) – 1
MC Sircilla- 4
TOTAL – 24
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఇంచార్జి డి.ఆర్.ఓ టి. శ్రీనివాస్ వేములవాడ ఆర్.డి.వో. పవన్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.