మహిళా బిల్లులో బి.సి మహిళలకు సబ్ కోటా కల్పించలి
అన్ని రంగాలలో సాధికారత కల్పించాలి
బి.సి మహిళ సంఘాల సమావేశం డిమాండ్
హైదరాబాద్ మార్చ్ 13 మహిళలపై జరిగే ఆకృత్యాలను, హత్యా చారాలను, గృహహింస లను అరికట్టడానికి కటినమైన చట్టాలను తయారు చేసి అమలు చేయాలని, పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టి మహిళలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే మహిళ బిల్లులో బి.సి. మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే బి.సి. మహిళల కు రాజ్యాధికారం దక్కుతుంది అని రజ్య సభ సబ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బిసి భవన్ లో బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఏ. పుష్ప లత అద్యక్షతన జరిగిన బి.సి మహిళల సమావేశానికి ముఖ్య అతిది గా విచ్చేసి ప్రసంగించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళ బిల్లులో బి.సి. మహిళలకు జనాభా ప్రకారం సబ్-కోటా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మహిళ బిల్లులో బి.సి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత లేదన్నారు. ఇప్పటికే మహిళ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్ సభలో కూడా పెట్టి పూర్తి చేయాలని కోరారు. మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బి.సి మహిళల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నాం. బి.సి.లంటే చిన్న చూపా? అసెంబ్లీ లో మొక్కుబడిగా తీర్మాణం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు. మహిళ బిల్లు పాస్ కావాలంటే బి.సి మహిళలకు సబ్-కోటా ఇవ్వక తప్పదు. జనాభాలో సగం ఉన్న బి.సి.మహిళలకు కోటా ఇవ్వకుండా మహిళల గురించి మాట్లాడటం అన్యాయమన్నారు. మహిళ బిల్లులో రాజకీయ రిజర్వేషన్ల తో పాటు విద్యా – ఉద్యోగాలలో కూడా 50 శాతం రిజర్వేషన్ల ను ప్రవేశపెట్టాలని కోరారు.అనంతరం బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఏ. పుష్ప లత మాట్లాడుతూ మహిళలకు రక్షణ కోసం ఇప్పటికీ అనేక చట్టాలు ముఖ్యంగా వరకట్న నిషేద చట్టం ,అత్యాచార, నిరోధక చట్టం ,నిర్భయ చట్టం ,బాల్య వివాహాల నిరోధక చట్టం, దిశా చట్టం లాంటి 19 చట్టాలు వచ్చిన్నపటికి వారి పై అత్యాచారాలు తగ్గలేదు .పురుశాదిక్యత తగ్గలేదని ఆవీదన వ్యక్తం చేసారు. మహిళల రక్షణ కోసం మరిన్ని చట్టాలు తేవలసిన ఆవసరం ఉందన్నారు. మహిళలు మరింత చైతన్యం కావలసిన అవసరం ఉందన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విదించినపుడే మహిళా ప్రగతి జరుగుతుంది. మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయి. మద్యపానాన్ని నిషేదించాలని అందులో మొదటి దశలో బెల్టుషాపులు ఎత్తివేయాలని జాతీయ రహదారులు ప్రధాన రహదారిలో పక్కన ఉన్న మద్యం దుకాణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రాత్రి ఏడు గంటల తర్వాత మద్యం దుకాణాలు మూసి వేయాలని కోరారు డ్రగ్స్ ను పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. సమావేశం లో పాల్గొన్నబిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కే.లక్ష్మి మాట్లాడుతూ బీహార్ లో మధ్యపాన నిషేధం విధించిన తర్వాత అత్యాచారాలు, హత్యలు తగ్గిపోయాయి. గతంలో మన రాష్ట్రంలో కూడా మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పుడు అత్యాచారాలు, హత్యలు, హింసాత్మక సంఘటనలు తగ్గినా విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసారు. అలాగే అత్యాచారాలు, హత్యలకు సినిమా రంగం కూడా తోదవుతుoదన్నారు. సినిమాలలో అసభ్యకర అంశాలు ముఖ్యంగా నగ్న, అర్థనగ్న, సెక్స్ దృశ్యాలు పూర్తిగా నిషేధించాలని కోరారు. కొన్ని సీరియల్స్, సోషల్ మీడియాలు కూడా వ్యాపార దృక్పథంతో సెక్స్ ప్రేరేపించే దృశ్యాలు ,మాటలు, డైలాగులను కొనసాగిస్తున్నారని వీటిని తొలగించాలని కోరారు.అనంతరం ఆర్, కృష్ణయ్య పుష్ప లతా , కే.లక్క్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షురాకు లతాసింగ్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో జ్యోతి,మంజులత,విజయలక్ష్మి,నీల వెంకటేష్, టి.సతీష్, బాలయ్య