హైదరాబాద్ మార్చ్ 6 ();అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్ బాగ్ లో గల దివ్యాన్గుల కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ జాతీయ కార్యనిర్వాక అధ్యక్షురాలు శివలెంకల నాగ యుదయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఎనిమిదవ తేదీ ఉదయం 10 గంటలకు వివిధ రాజకీయ పార్టీల తో మహిళ సమ్మేళన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు.
Prev Post