ఖమ్మం ప్రతినిధి మార్చి 06 (ప్రజాబలం) ఖమ్మం మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం* జరిగింది.ఈ సమావేశంలో భాగంగా మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జి బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ మార్చి 10వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళ ఉద్యమకారులకు ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు సన్మానం నిర్వహించడం జరుగుతున్నది. అదే విధంగా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులందరికీ న్యాయం జరిగేలా ఖమ్మం జిల్లా ఉద్యమకారుల హక్కుల సాధనకోసం కార్యాచరణను సిద్ధం చేస్తునట్లు తెలిపారు.భవిష్యత్తులో ఉద్యమకారుల హక్కులపై మరో ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు.ఉద్యమకాలంలో ఆగమైన ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డోకుపర్తి సుబ్బారావు,పగడాల నరేందర్ మంచికంటి నరేష్,మందడపు శంకర్రావు,లింగనబోయిన సతీష్, అబ్బాస్,గొట్టేపర్తి శ్రీనివాస్, పోతురాజు రమాదేవి,మరియ కుమారి,గ్లోరీ,కొండు రజినీకాంత్ దరిపల్లి వీరబాబురాజేష్ ఆసిఫ్ నాగుల్ మీరా కోటేష్ యాదవ్ అశోక్ సింగ్ వసీమ్ ఖాన్ శివాజీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు