ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 06 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండల జర్నలిస్టులకు ఇండ్ల స్థలం కేటాయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు తాండూర్ మండల పాత్రికేయులు వినతి పత్రం అందజేశారు.అనంతరం క్లబ్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ…గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు పత్రికలలో పని చేస్తూ ప్రభుత్వానికి,ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి ప్రజా సమస్యలపై అనేక వార్తలు రాస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తూ మా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మండలానికి చెందిన కొంతమంది పాత్రికేయులకు గతంలో ఇండ్ల స్థలాలకు భూమి కేటాయించారు. అదేవిధంగా మాకు కూడా ఇండ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
పాత్రికేయులు,దుద్దిల్ల రామ్మోహన్,
ఈర్ల శ్రీనివాస్,అసం అశోక్, సిద్ధంసేటి పవన్ కుమార్,మీనుగు సూర్య ప్రకాష్,శనిగారపూ వినోద్,కొడిమల శ్రీకాంత్,మోర్ల జెనార్ధన్, తదితరులు పాల్గొన్నారు