అంబర్పేట్ అంగన్వాడి కేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ మార్చ్9 ;అంబర్పేట్ లోని ప్రేమ్ నగర్ అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి విభాగం నాయకుడు గుర్రం రాజశేఖర్ గంగాపుత్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పేదలకు సేవలందిస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు, ఆశ వర్కర్లు కు, అంగన్వాడి టీచర్లకు, రాజశేఖర్ శాలువాతో సత్కరించి వారికి గిఫ్ట్ లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత ద్వారానే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రమీల,సరూప,దేవయాని,శోభ,రజిత, సునీత,మాధురి,రాణి,రేణుక,పవన్,నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking