ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 09 : మంచిర్యాల జిల్లా లోని లక్షెట్టిపేట విద్యార్థులు అంకిత భావంతో చదివి ఉత్తమ పౌరులుగా రాణించాలని సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు మహిళ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 11 వరకు అవగాహనా సదస్సుల్లో భాగంగా ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ…..విద్యార్థి దశలో ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చన్నారు.కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురైనప్పటికీ విద్యార్థి దశలో ఖచ్చితత్వంతో కష్టాలకు భయపడకుండా చదివితే సమాజానికి ఆదర్శంగా నిలువచ్చని వివరించారు.ముఖ్యంగా సోషల్ మీడియా కు దూరంగా ఉండి తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం పడుతున్న కష్టాలను గుర్తుకు తెచ్చుకుంటే విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని ధీమా వ్యక్తం చేశారు.అదే విధంగా సమాజంలో జరుగుతున్న పరిణామాలను గుర్తించి చట్టాలపై అవగాహనా పెంచుకోవాలని సూచించారు.అంతకుముందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్ మాట్లాడుతూ…చదువుపై దృష్టి పెట్టి,ఇతర విషయాలకు దూరంగా ఉండాలన్నారు.టీనేజ్ లో దృఢ సంకల్పంతో చదివితేనే మంచి పౌరులుగా రాణిస్తారన్నారు. అర్ధవంతంగా ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకుంటే విద్యార్థులు చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడతారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీ ఐ కృష్ణ రెడ్డి, ప్రిన్సిపాల్ లలిత కుమారి, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.