హైద్రాబాద్.మార్చ్ 8.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బోడుప్పల్, ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆకాశంలో సగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటం తమకెంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నదన్నారు. మహిళలు వంటింటికే పరిమితమనేది కేవలం అపోహ మాత్రమేనని, మహిళలలకు అవకాశాలు కల్పించకపోవడంతోనే వెనకబడ్డారన్నారు. ఈ సాకేతికయుగంలో మహిళలు వారికవే అవకాశాలను సృష్టించుకొని తామే కాకుండా తమ చుట్టూ ఉన్న సమాజాన్ని బాగుపరుస్తున్నారన్నారు. కాలనీ సమగ్రాభివృద్ధికి కంకణబద్దులమై పనిచేస్తామని, సమైక్యతా శక్తిని చాటుతామని తెలిపారు.
ఈ వేడుకల్లో స్ధానిక పారిశుద్ధ్య మహిళా కార్మికులకు శాలువా కప్పి, పూలను అందించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ బాలాజీహిల్స్ లలితా మహిళా మండలి నాయకురాండ్లు యెల్లాప్రగడ రాణిపార్వతి, కాయితి కళా, పి.స్వర్ణలత, ఈనిక జ్యోతి, డి.లక్ష్మి, ఆకుల ఉదయచంద్రిక, భారత పారిజాత, మునుకుంట్ల ఉమా సుందరి, కర్నాటి సురేఖ, జీకే రోజా, జ్యోతి, చంద్రకళ, నాగులు, సాంబక్క, బాలమణి, దుర్గ మరియు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పద్మశాలి సత్యనారాయణ, కాయితి నరేందర్, వెంకటేశ్వర రావు, వై.విజయ్ కుమార్, భారత సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.