అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 8 (ప్రజాబలం) ఖమ్మం టిఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవంను పురస్కరించుకొని పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆహ్లాదకర వాతావరణంలో ఆనందించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీజెఎసి సెక్రెటరీ జనరల్ టిజిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు పాల్గొని మహిళలు పోరాటం ద్వారానే తమ హక్కులను సాధించుకుంటారని అన్ని రంగాల్లో ముందుంటున్నారని ఇదే ఒరవడి కొనసాగించి తమ సామర్థ్యం నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా ఉద్యోగుల సమస్యల పట్ల ఎప్పుడైనా తనని సంప్రదించవచ్చని వాళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి భాయి మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉన్న తమ వైద్య ఆరోగ్యశాఖ ప్రజలకి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు .స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ మహిళా సాధికారతకి తన వంతు కృషి చేయనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలోటిఎన్జీవోస్ మహిళా విభాగం చైర్ పర్సన్ జి.మృదుల కన్వీనర్ బి.వి. సుబ్బమ్మ టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొనిదెన శ్రీనివాస్ ట్రెజరర్ వల్లపు వెంకన్న, ఉపాధ్యక్షురాలు లలిత కుమారి, జాయింట్ సెక్రెటరీ శీలం రాధికా రెడ్డి కార్యవర్గ సభ్యురాలు నెల్లూరి విజయ నాగలక్ష్మి మహిళా విభాగం కార్యవర్గం వెంకటమ్మ, భావన వెన్నెల, కోమలి శ్రావణి సుజాత జోష్న హసీనా వసంత రమ్య రాంబాయి షేక్ జరీనా పద్మావతి శ్యామల, లక్ష్మి మాధురి నాగలక్ష్మి ఫాతిమా ఫార్హీన్ మాణిక్యం రమాదేవి పార్వతి హిమబిందు మొదలగువారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking