మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని
లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 08 : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా కానిస్టేబుళ్లను సీఐ నరేందర్,ఎస్సై సతీష్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…మహిళ లేనిదే సమాజం లేదని,ఈ సమాజానికి వ్యవసాయం, పశుపోషణ, పనిముట్లు వాడకం నేర్పింది మహిళలేనన్నారు. నాగరికతకు పునాదులు వేసింది వారేనన్నారు. ఆదిమ మానవుని నుండి ఆధునిక మానవుడిగా ఎదగడానికి మహిళలు చేసిన కృషి వెల కట్టలేనిదన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.