ఖమ్మం ప్రతినిధి మార్చి 8 (ప్రజాబలం) ఖమ్మం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కుమ్మర మొల్ల జయంతిని పురస్కరించుకొని కుమ్మర మొల్ల ప్రతిభా పురస్కారాలు ను కొలిచలం బ్రహ్మయ్య – విజయ సహకారంతో ఈ కార్యక్రమం కొలిచలం గీత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఖమ్మం జిల్లా కుమ్మర శాలివాహన ప్రజాపతి,మహిళల ప్రతిభను గుర్తించి ప్రతిభా పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది.

మహిళా మణులు ఆత్మీయ సమ్మేళనం పురస్కరించుకొని మహిళలు మాట్లాడుతూ సృష్టికి మూలం శక్తికి రూపం త్యాగానికి ప్రతిరూపం,సహనానికి నిదర్శనం ప్రేమానురాగాలకు పర్యాయపదం స్త్రీ స్త్రీ ని గౌరవించబడినప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది కాబట్టి మహిళా దినోత్సవం ని ఒక పండగ వాతావరణంలా నిర్వహించి మహిళలను గౌరవించాలి అని వారికి సమాన అవకాశాలను కల్పించాలని, మహిళలు మాట్లాడటం జరిగింది . ఈ కార్యక్రమంలో కొలచలం గీత, కొలిచలం విజయ, విలాసాగరం రమాదేవి, రాధ, కవిత, నాగమణి, ఝాన్సీ, రాజేశ్వరి, కల్పన, యశోద, ఉష, విజయలక్ష్మి, స్వరూప, వెంకటలక్ష్మి, అనిత, అనసూర్య, నాగమ్మ, ఉమ, చిట్టెమ్మ, సత్యాప్రియ, సుహాసిని, తదితర మహిళలు పాల్గున్నారు