మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం దినపత్రిక- మెదక్ జిల్లా నియోజకవర్గo
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని తద్వారా చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. అన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం వారు రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూల మరియు సహజ రంగులు ఉపయోగించి తయారు చేసిన మట్టి విగ్రహాలని పూజించాలి అన్నారు. మట్టి గణపతే మహాగణపతి అని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించుట కొరకు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్, , పర్యావరణ శాస్త్రవేత్త. ,T. రవీందర్, కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యలయం, ఆర్.సి. పురం మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.