ప్రభుత్వ సహాయం కోసం బాధితుల ఎదురుచూపు
ప్రజా బలం ప్రతినిధి 3 సెప్టెంబర్ 2024 :
కొల్చారం మండల్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో దక్కలి నర్సింలు పూరి గుడిసె లో అర్ధరాత్రి కుటుంబీకులందరూ నిద్రపోతుండగా భారీ వర్షానికి కుప్ప కూలిపోయింది ఆ ఇంటి యజమానికి కూలిపోవడంతో బలంగా దెబ్బలు తాకాయి ఇది చూసి గ్రామ నాయకులు దగ్గు మల్లేశం మాట్లాడుతూ కుటుంబీకులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని కోరారు గ్రామపంచాయతీ కార్యదర్శి మౌనిక కు సమాచారం ఇవ్వగా ఆమె వెంటనే స్పందించి ఘటన స్థలికి చేరుకుంది నేను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి తగు న్యాయం చేస్తానని వాళ్లకు హామీ ఇచ్చింది ఈ కార్యక్రమంలో దగ్గు మల్లేశం బోన్ల శంకరయ్య దగ్గు దుర్గయ్య దగ్గు విట్టల్ కిష్టాగౌడ్ తదితరులు పాల్గొన్నారు