ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 7 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 50 కార్లలో జిల్లా యాదవ ముఖ్య నాయకులు హైదరాబాద్ కు తరలి వెళ్లి రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గార్లను కలిసి వినతి పత్రం ఇచ్చి ఖమ్మం జిల్లా యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఖమ్మం జిల్లా యాదవులకు, కురుమలకు ఇంతవరకు రాష్ట్రస్థాయిలో ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదని, చట్టసభలలో కనీసం ఎమ్మెల్సీగా కానీ కూడా చేయలేదని ఈసారి ఎలాగైనా చట్ట సభలలో ఎమ్మెల్సీగా జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా డిసిసిబి చైర్మన్ ఖమ్మం జిల్లాలో మేయర్లు కార్పొరేషన్ చైర్మన్, కార్పొరేటర్లు, జడ్పిటిసి ఎంపీపీగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిలభారత యాదవ మహాసభ నాయకులు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా అని, ఆ జిల్లాలోరెండు లక్షల ఓట్లు కలిగిన యాదవుల కు దశాబ్దాలు తరబడి రాజకీయ ప్రాతినిధ్యం లేదని, దీనివలన అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని, ఇకనైనా రాజకీయ నాయకులు మేలుకొని, చిత్తశుద్ధితోకురుమ యాదవులకు న్యాయం చేయాలని,రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో జడ్పిటిసి ఎంపీపీలు,చట్ట సభలలో ఎమ్మెల్సీ, రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, ఇప్పటివరకు కురుమ యాదవులను రాజకీయంగా వాడుకున్నారే తప్పఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని,రాజకీయ పార్టీలు మా వినతులను స్వీకరించి మాకు అవకాశం ఇప్పించాలని లేనియెడల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మా ప్రభావం కచ్చితంగా ఉంటుందనితెలిపారు.ఈ కార్యక్రమంలో ఎర్రబోయిన వీరభద్రం దుబాకుల వెంకటేశ్వర్లు ఇమ్మడి రామనాథం, పుచ్చకాయల కృష్ణ, మొగిలి అప్పారావు దొడ్డ శ్రీను, మేకల సైదులు మారుతీ ఎట్టయ్య,మెంటం కృష్ణ పుట్ట ఉపేందర్, బ రిగెల రామ్మూర్తి భారీ వీరభద్రం, బండారి మోహన్, అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్ మెండెం శ్రీను, పుచ్చకాయల వెంకటేశ్వర్లు తెల్లబోయిన రమణ,బండారి ప్రభాకర్ సత్తి వెంకన్న,మీగడ శ్రీను కన్నె బోయిన సీతారామయ్య, సారపాక సత్యనారాయణ గుమ్మా రోశయ్య, యనుముల రాము రుక్మిణియాదవ్ఇమ్మడి తిరుపతిరావు, మెండెం వెంకటేష్, పగడాల మధు, దుప్పటి రవి,గూదే భద్రయ్య పల్లెబోయినశ్రీనివాస్,కంబాల ముసలయ్య,మద్దిని గుట్టయ్యచింతలచెరువు కోటేశ్వరరావు,మేకల మల్లికార్జునరావు జోనబోయిన పాపయ్య, పొదిలి సతీష్, మాదాల లింగయ్య,కాసు మల్లేష్, పంపాద్రి,చిలకల రామకృష్ణ భారీ విజయ్,సత్తి చిట్టిబాబు మంద నాగేశ్వరరావు, నరేష్,పొదిలి భూపతి,మేకల అశోక్, మురారి లింగస్వామి పచ్చిపాల వెంకట్,శ్రీకాంత్ మాదనబోయిన శ్రీను సోమనబోయిన మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు