గోశామహల్ బిఆర్‌ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్
గోశామహల్ ప్రజాబలం ప్రతినిధి:బుధవారంనాడు జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలి ని గోశామహల్ బిఆర్‌ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కోఠి లోని కామత్ హోటల్ పక్కన ఉన్న జిహెచ్‌ఎంసి షాపుల టెండర్ లలో అవకతవకలు జరిగాయని గత పది నెలలుగా ప్రతి అధికారి చుట్టూ తిరుగుతూ , ఆధారాలు ఇచ్చిన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని వివరించారు. అక్కడ జరిగిన అవినీతిని కమిషనర్ గారికి ఆనంద్ కుమార్ గౌడ్ తెలిపారు. అనంతరం గౌలిగూడా లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడారు… ఒక్కొక ఇంటిలో ఇద్దరికి , తక్కువ ధరలకు టెండర్ లను ఇచ్చారన్నారు. ఎస్టేట్ ఆఫీసర్ , అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్లు అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. వెంటనే వాటి టెండర్ లను రద్దు చేసి , రీ టెండర్ లు నిర్వహిస్తే , జిహెచ్‌ఎంసి కు ఆదాయం వస్తుందన్నారు. గౌలిగూడా బస్ డిపో వద్ద కొన్ని షాపులు ఒక్కరికే కట్టబెడుతున్నారని , వారు నిర్ణయించిన రేట్లకు షాపులను ఇస్తున్నారని అన్నారు. ఈ అంశాలపై విచారణ జరిపి , రిపోర్ట్ ఇవ్వాలని ఆడిషినల్ కమిషనర్ ఎస్టేట్ కు కమిషనర్ ను ఆదేశించారు. ఈ టెండర్లు రద్దు అయ్యేవరకు తన పోరాటం ఉంటుందని , పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు ముందు ఉంటానని ఆనంద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు .ఈ కార్యక్రమంలో జాంబగ్ డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్ పాల్గొన్నారు.