గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది, పిల్లలను వారి పిల్లలుగా భావించి, అంకితభావంతో విధులు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 7 (ప్రజాబలం) గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది, పిల్లలను వారి పిల్లలుగా భావించి, వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం కలెక్టర్, నగరంలోని అల్లిపురం రోడ్, చావా రామయ్య నగర్ లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాల ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పరిసరాలు, తరగతి గదులు, టాయిలెట్లు, డార్మెటరీ బ్లాక్, కిచెన్ షెడ్లు, బియ్యం, పప్పు, వంట సరుకులు, కూరగాయల స్టోర్ లను ఆయన పరిశీలించారు. విద్యార్థినులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించి, వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం, స్నాక్స్, కోడిగుడ్డు పెడుతున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ పండ్లు ఇస్తున్నది లేనిది అడిగారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ఉంటాయి కనుక విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని బాధ్యులను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా మెరుగైన సౌకర్యాలను కల్పించాలన్నారు. పాఠశాల పరిసరాలల్లో ఎక్కడ చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు గాని లేకుండా చూడాలని, లోపల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. తరగతి గదిలో గాలి, వెలుతురు బాగా ఉండాలని, గదులలో అవసరాన్ని బట్టి, అదనంగా లైట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాత్రిపూట విద్యార్థినులు బయటకు రాకుండా పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు స్థానికంగా ఉండి, సాయంత్రం సమయంలో సబ్జెక్టుల వారీగా వెనుకబడిన పిల్లలకు ప్రత్యేకంగా బోధించి, వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బడి పంతులుగా మారి విద్యార్థుల వద్దకు వెళ్లి స్వయంగా విద్యా బోధన చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం పలు అంశాల పట్ల ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టారు. పాఠశాలలో గ్రంథాలయం, తరగతి గదులలోని విద్యార్థినులను పలకరిస్తూ, వారి పాఠాలు, సిలబస్ గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు వారి పుస్తకాలలో నుండి పలు ప్రశ్నలను వేస్తూ వాటిని చదవడం, వ్రాయడంలో మెళకువలు చెపుతూ, విద్యార్థులు ఎదుర్కొనే సందేహలను నివృత్తి కలెక్టర్ నివృత్తి చేశారు. పాఠశాలకు వెళ్లే అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు
సమర్పించాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, గురుకుల ప్రిన్సిపాల్ సీతామహాలక్ష్మీ, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking