ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం లో అప్లై చేసుకునేందుకు చివరితేది ఆగష్టు 10
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 7:
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ల్ (TSIC) రాష్ట్ర ప్రభుత్వం చే గ్రామీణ ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి గ్రామీణ స్థాయి నుండి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహిస్తున్నది.
వివిధ రంగాలైన పారిశ్రామికంగా, వ్యవసాయ,కన్స్ట్రక్షన్ మొదలైన రంగాలలో మరియు రోజు వారి జీవితం లో పలు రకాలైన సమస్యలు ఉత్పన్నం ఔతాయి కాబట్టి వాటికీ పరిష్కరించడంలో కొత్త కొత్త ఆలోచనలకూ పదును పెట్టి నూతన ఆవిష్కరణలను చేసే వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ల్ (TSIC) వారు నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం లో అప్లై చేసుకునేందుకు చివరితేది ఆగష్టు 10 వ తేదీ వరకు పొడిగిస్తున్నటు ఈ సందర్బంగా తెలిపారు.
దరఖాస్తు చేసుకొనేవాళ్ళు తమ పేరు, వయసు, ఫోటో, వృత్తి, చిరునామా, మండలం, జిల్లా పేరు తెలియచేస్తూ ఆవిష్కరణలయొక్క పేరు మరియు దానిగురించి వివరిస్తూ 100 పదాలలో వ్రాసి పంపించాలని మరియు ఆవిష్కరణలయొక్క ఫోటోలు-4 మరియు ఆవిష్కరణ గురించి వివరిస్తున్న 2 నిమిషాల నిడివి కల వీడియోలను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ల్ (TSIC) వాట్సాప్ నెంబర్ 9100678543 కి ఆగష్టు 10 వ తేదీ లోపు పంపాలని తెలియజేసారు.