పెట్రేగి పోతున్న భూకబ్జాదారులు.. పట్టించుకోని పోలీసులు
ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో వరస ఘటనలు
సంచలనం కలిగిస్తున్న రైతుల ఆత్మహత్యలు
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 07 (ప్రజాబలం) ఖమ్మం
భూ కబ్జాదారుల ఆగడాలకు ఖమ్మం జిల్లాలో మరో రైతు బలి అయ్యాడు జులై2న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం పొద్దుటూరులో భూ కబ్జాదారుల ఆగడాలకు బోజడ్ల ప్రభాకర్ అనే రైతు పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన మరువకముందే.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజక వర్గం ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాలో భూ కబ్జాదారుల దాటికి సన్న చిన్న కారు రైతు ఏలేటి వెంకటరెడ్డి (46) తన పొలం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న రైతులు ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయిరైతు వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి , భూపాల్ రెడ్డి అనే అన్నదమ్ములు ఉన్నారు. వీరి వాటాకు వచ్చిన భూమిలో వెంకటరెడ్డి తమ్ముడు భూపాల్ రెడ్డి అనే రైతు అదే గ్రామానికి చెందిన జాటోత్ వీరన్న కు ఎకరం భూమినివిక్రయించాడు డబ్బులు చెల్లింపులో అలసత్వం వహించి విడతల వారీగా చెల్లిస్తూ భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా గుట్టు సప్పుడుగా ప్రాంసరీ నోట్, అగ్రిమెంట్ పత్రాల పై సంతకాలు తీసుకొని గతంలో రిజిస్ట్రేషన్ చేయించు కున్నాడు సరిహద్దుల విషయంలో మరో మారు తప్పుడు పత్రాలు సృష్టించి సంతకాలు తీసుకొని ఆ భూమిని తన వశం చేసుకునేందుకు ప్రయత్నించాడు వీరన్న ఆగడాలు తట్టుకోలేక భూపాల్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురై 2021లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ క్రమంలో జాటోతు వీరన్న కొనుగోలు చేసిన భూమి సాగుకు అనుకూలంగా లేదని భావించి, భూపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి భూమి ని దాదాపు ఆర ఎకరం మేరా సరిహద్దు భూమిని కబ్జా చేసి సాగు చేయటం ప్రారంభించాడు దీనిని అడ్డుకునేందుకు వెళ్లిన వెంకటరెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు పలు దఫాలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. వీరన్న పై పోలీసులు పలు సెక్షన్ల కింద గతంలో కేసులు నమోదు చేశారు. ఈ వివాదంలో ఇరువురు కూడా కోర్టును ఆశ్రయించి ఎవరికి వారుగా ఫై చెయ్ సాధించారు ఈ వివాదం దాదాపు గత 10 సంవత్సరాలు గా కొనసాగుతూ వస్తుంది. సుడో మావోయిస్టుగా పేరు ఉన్న జాటోత్ వీరన్న తరచూ ఏదో ఒక వివాదంలో తలదురుస్తూ దౌర్జన్యంగా భూకబ్జాలకు పాల్పడే వీరన్న ను ఎదుర్కొనే శక్తి వెంకటరెడ్డికి లేకుండా పోయింది ఈనెల నాలుగో తేదీన ఆదివారం ట్రాక్టర్ సహాయంతో తను ఆక్రమించిన భూమిని దున్నుతూ పొలం వేసేందుకు వీరన్న సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డి తన పొలానికి వచ్చి చూడగా అప్పటికే ట్రాక్టర్ సహాయంతో వీరన్న తో పాటు అతని కుటుంబ సభ్యులు నాట్లు వేసే పనిలో నిమగ్నమే ఉన్నారు ఆ పనులను ఆపమని వెంకటరెడ్డి ఎంత వేడుకున్నా కూడా వారు వినలేదు. పోలీసులకు ఫిర్యాదులు అనేకమార్లు చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు తన పొలం కండ్ల ఎదుటే కబ్జాకు గురవుతుంటే చూస్తూ ఊరుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటరెడ్డి తన పొలంలో ఉన్న పురుగుల మందు తాగి సెల్ఫ్ వీడియో తీసుకున్నాడు. తన చావుకు జాటోత్ వీరన్న అతని కుటుంబ సభ్యులేనని, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తన సెల్ఫీ వీడియోలో ఆవేదనను వ్యక్తం చేశారు. ఈనెల 4న పురుగుల మందు తాగిన వెంకటరెడ్డి మూడు రోజులు పాటు ఖమ్మంలోని శ్రీ రక్ష ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు వెంకట్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఖమ్మం రూరల్ పోలీసులు జాటోత్ వీరన్న తో పాటు మరో ఆరుగురుపై 306 రెడ్ విత్, 447,427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపారు
ఖమ్మం జిల్లాలో వరస ఘటనలు
ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న కూడా ఇటుపోలీసులు అటు మంత్రులు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేకపోవడం తీవ్ర చర్చంగా మారింది. నిన్న పొద్దుటూరులో లేడు ఖమ్మం రూరల్ లో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యల ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో ఇటుప్రజలు అటు అన్నదాతలు ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యానికి, భూ కబ్జాదారుల ఆగడాలకు మరిన్ని ప్రాణాలు పోతాయేమోనని జనం భయంతో వణికిపోతున్నారు భూ కబ్జాదారులను ఉక్కు పాదంతో అణచిన్నప్పుడే కొంతైనా ప్రయోజనం చేకూరుతుంది