మహా అన్నదాన ప్రసాదం.
హాజరైన ప్రజాప్రతినిధులు.
తూప్రాన్, ఆగస్టు, 7 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ పెట్రోల్ పంపు వద్ద ఎల్లమ్మ కమాన్ లో స్వయంభువుగా వెలసిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం లో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భూమన్నగారి
నందం గౌడ్, సహదేవ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, భూమన్నగారి కుటుంబ సభ్యులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని విశేష పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఒడి బియ్యం తో అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త భూమన్నగారి శ్రీకాంత్ గౌడ్, నాయకులు దాబా కాశిరెడ్డి మాట్లాడుతూ ఎల్లమ్మ దేవతనే రేణుక అమ్మ వారు అని కూడ పిలూస్తారని, ఎల్లమ్మ కథను జవనిక (యంత్రవాద్యం) వాయిస్తూ చెప్పే ఎల్లమ్మ కథ భక్తుల హృదయాలను కదిలించే ఒక ప్రత్యేక స్థానాన్ని గౌడ కులస్తుల కుల దేవత గా నిలిచారని అన్నారు. తండ్రి ఆజ్ఞపై పరశురాముడు తల్లి రేణుక దేవిని అప్పటి నుంటి రేణుక ఎల్లమ్మ ను తమ కులదేవతగా కొలుస్తున్నారు. ఎల్లమ్మ గుడి ఊరిలోనే గ్రామ దేవతగా భక్తులచే పూజలందుకుంటూ ఉంది. ఎల్లమ్మ దగ్గర జలకడవ కూడా ఉంటుంది. జలకడవ అంటే నీరు తెచ్చే కుండ. ఎల్లమ్మ దేవాలయం లో ఎల్లమ్మ ఉండే దిశకు తిరిగి నైవేద్యం పెట్టడం జరుగుతుందనీ తెలిపారు. రేణుకా ఎల్లమ్మ దేవతకు మ్రొక్కుకున్నవారు వెండితో కళ్ళు, పాదాలు చేయిస్తారనీ తెలిపారు. ఆర్థిక స్థితి బాగు లేనివారు, కట్టె పాదాలు చేయిస్తారన్నారు. పాకోళ్ళు సమర్పిస్తారు. కల్లు పోస్తారు. ఎల్లమ్మ పోషకదేవత. ఆమె భక్తులు ఆమెను “విశ్వమాత”గా లేదా “జగదాంబ” గా భావిస్తారు అని అన్నారు. తూప్రాన్ పట్టణంలోని పెట్రోల్ పంపు వద్ద స్వర్గీయ భూమన్నగారి సరోజన ఆలయ నిర్మాణానికి అకుంఠిత దీక్షతో నడుముకు జోలె కట్టి భక్తుల సహకారంతో తన స్వంత విలువైన స్థలంలో ఓ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ వెలసిన శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి భక్తుల పాలిట కొంగుబంగారమై వరాలనిచ్చే తల్లి గా, భక్తుల కోరికలు తీర్చే ఇలా వెల్పుగా దినదిన అభివృద్ధి చెందుతూ దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. భూమన్నగారి సరోజన అనంతరం ఆమె జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచాయి. వారి వంశస్తులు పుత్రులు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం దీపధూప నైవేద్యాలు, వేద మంత్రోచ్చారణ తో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భూమన్నగారి నందంగౌడ్, సహదేవ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, సాయి గౌడ్, రాజు గౌడ్, కొక్కొండ కాశిరెడ్డి, సి.అర్. జానకిరామ్, భాస్కర్ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, వెంకటేష్, పూర్ణరాజు, రవీందర్, రామారావు, వీరభద్రి ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.