సెంట్రల్ యూనివర్సిటీ లో సిటు సాధించిన సి ఓ ఈ బెల్లంపల్లి విద్యార్థి తీగల ఆశ్రిత్

 

అభినందించిన జోనల్ అధికారి హెచ్.అరుణ కుమారి

ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఆగస్టు 07 : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థి తీగల ఆశ్రిత్ జె ఈ ఈ మెయిన్స్ లో అర్హత సాధించిన సోమవారం వెలువడిన సి సబ్ మొదటి విడత కౌన్స్లింగ్ లో సెంట్రల్ యూనివర్సిటీ హర్యానాలో బి టెక్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రవేశం సాధించిన తీగల ఆశ్రిత్ ని కాళేశ్వరం జోనల్ అధికారి హెచ్ అరుణ కుమారి అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సాంఘిక సంక్షేమ గురుకులలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల శిక్షణ ఇవ్వటంతో పాటు జాతీయ స్థాయి పరీక్షలకు తగిన శిక్షణ ఇస్తున్నామన్నారు. తద్వారా ఐ ఐ టి.ఎన్ ఐ టి.నీట్.సెంట్రల్ యూనివర్సిటీ లలో ప్రవేశాలు సాదిస్తున్నారని తెలిపారు.విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి జాతీయ స్థాయిలో సీట్లు సాదించేందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులను అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి తీగల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ…ఎంతో మంది విద్యార్థులకు గొప్ప గొప్ప జాతీయ స్థాయి విద్యాలయాలలో సీట్లు సాధించేలా శిక్షణ ఇచ్చేలా కృషి చేసిన ఐనాల సైదులు కి మరియు అధ్యాపకుల అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఫోన్ అభినందించిన కాళేశ్వరం జోనల్ అధికారి హెచ్.అరుణ కుమారి కి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking