పవర్ లూమ్ కంటే – చేతి పనితో చేసే హ్యాండ్లూమ్ ఎంతో గొప్ప.
… జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు .
సంగారెడ్డి ఆగష్టు 07 ప్రజ బలం ప్రతినిధి : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి ఐ టి ఐ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీ లో జిల్లా అధికారులు, చేనేత కార్మికులు, తో కలిసి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు , అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు, చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత నందించి వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటు నందిస్తున్నదని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు .
పవర్ లూమ్ కంటే చేతి పనితో చేసే హ్యాండ్లూమ్ ఎంతో గొప్పదని, గద్వాల చేనేత చీరలంటే ఎంతో ఖ్యాతి ఉందని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం చేనేత కార్మికుల యొక్క నైపుణ్యాన్ని ప్రజలకు చాటి చెబుతూ ప్రతి ఒక్కరు చేనేత చీరలను ధరించేటట్లు ప్రోత్సహించాలని అన్నారు. చేనేత వృత్తిని అందులోని నైపుణ్యాన్ని యువత తెలుసుకొని నేర్చుకోవాలన్నారు. చేనేత వస్త్రాలు వారసత్వ కళా రంగాన్ని కాపాడాలని అన్నారు. చేనేత వస్త్రాలు ప్రజలందరూ ధరించాలని ,అందరికి అవగహన కల్పిస్తే చేనేత రంగాన్ని కాపాడిన వారమౌతమని అన్నారు. మన నిత్య జీవితంలో చేతితో నేసిన వస్తువులకు ప్రాధాన్యత నివ్వడం జరగుతుందన్నారు. చెనేత వస్తువులు ఆదరణ తగ్గకుండా వారికి ప్రోత్సాహాన్ని అందించి రాబోయే తరానికి చేనేత వస్తువుల వినియోగంపై మక్కువను పేంపొందించడమే చేనేత రంగానికి ఇచ్చే గొప్ప బహుమానమని తెలిపారు. జిల్లాలో చేనేత కార్మికులను జిల్లా యంత్రాంగం వారిని ఆర్థికంగా అభివృద్ధి కోసం తోడ్పాటును అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు ,చేనేత జౌళి శాఖ అధికారి వెంకట రావు, చేనేత, ఉన్ని చేనేత సహకారసంఘాలు నారాయణఖేడ్ , జోగిపేట సంఘం సభ్యులు, జిల్లా అధికారులు, చేనేత కార్మికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.