జగిత్యాల, నవంబర్ 17: జగిత్యాల అసెంబ్లీ బరిలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బల్కం మల్లేష్ యాదవ్ కు రాష్ట్ర, జిల్లా యాదవ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. శుక్రవారం జగిత్యాల బీఎస్పీ కార్యాలయానికి వచ్చిన యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేకల రాములు యాదవ్, బండి మల్లయ్య యాదవ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ యాదవ్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి కొక్కెర దేవేందర్ యాదవ్, జడల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలుక కనక రాజు యాదవ్ మద్దతు ప్రకటించి ఈ ఎన్నికల్లో యాదవులందరు సమిష్టిగా బీఎస్పీ అభ్యర్థి బల్కం మల్లేష్ యాదవ్ కు వేయాలని పిలుపునిచ్చారు.