ఖమ్మం ప్రతినిధి నవంబర్ 17 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి తిరుమలాయపాలేం మండలం జూపేడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసిఆర్ కొట్లాడి సాధించు కున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాల ను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ గారి కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయ లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు కావున ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా ఉపాధ్యక్షులు జనక వెంకటేశ్వర్లు,మాట్టే యలేందర్,నిమ్మల నర్సింహారెడ్డి తో పాటుగా 12 కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు
