ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 4 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ డాక్టర్ గణేష్ శత్వార్ మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్ లో ముఖ్యంగా మూడు రకాల ప్రమాదకర మైనటువంటి క్యాన్సర్లు ఉన్నాయని అన్నారు . వాటిలో లుకేమియా , లింఫోమా , హేమటోలాజిక్ లు అనే మూడు రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి బ్లడ్ క్యాన్సర్లు చెందినవి . వీటిలో 67 సంవత్సరాల అత్యంత ఆధునాతన వయసు కోసం అప్లో ఇడెంటికల్ ట్రాన్స్ ప్లాంట్ చేసి సక్సెస్ ను సాధించడం జరిగింది . బిఎంటి కోసం ఇద్దరు సోదరులకు ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ అంతర్జాతీయ దాత మూలకనాలు ఉపయోగించబడుతున్నాయి బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ డిసీజెస్ సర్వైవర్ కలుసుకున్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించుకుంటామని వ్యాధి బారిన పడిన వారిని ఆదుకుంటామని ఈ ప్రాణాంతక పరిస్థితికి నివారణ కనుగొనే దిశగా కృషి చేస్తామని తెలిపారు . నయమైన బ్లడ్ క్యాన్సర్ బతికిన వారి నుండి వినడానికి అదే అనుభవంలో ఉన్న ఇతరులకు ఇది చాలా స్ఫూర్తిదాయకంగా సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు . ఇప్పటికే హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో వేలమంది బ్లడ్ క్యాన్సర్ రోగులకు వైద్యం చేసి సక్సెస్ అయినట్లుగా డాక్టర్ గణేష్ తత్వార్ తెలియజేశారు . ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ లో చికిత్స అందుకుని కోలుకున్న ఖమ్మం ప్రాంతానికి చెందిన పేషెంట్ నాగేశ్వరావు పాల్గొన్నారు .