ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 21 : యోగ దినోత్సవం సందర్బంగా బుధవారం పట్టణంలోని కోర్టు ఆవరణంలో జూనియర్ సివిల్ జడ్జ్ మోహిమ్మద్ అసదుల్ల షరీఫ్ ఆధ్వర్యంలో యోగ నిర్వహించారు.ఈ సందర్బంగా జూనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ.. యోగా సాధన వల్ల రోగాలు దరిచేరకుండా నిత్యం ఆరోగ్యంగా ఉంటామన్నారు.ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయవచ్చు యోగా అనేది కేవలం యోగా డే సందర్భంగా ఒక్కరోజు చేయడం కాకుండా కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే ఒక 30 నిమిషాల పాటు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివలన కేవలం మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా ఫిజికల్ గా కూడా మనిషి దృఢంగా ఉంటూ ఆరోగ్యకరంగా ఉంటాడు.కావున ప్రతి ఒక్కరు యోగా చేయడం అలవాటుచేసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్కరు యోగా అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో జైలర్ స్వామి,లక్షెటిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్, సూపరింటెండెంట్,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.