చరిత్రను సృష్టించిన మీరే

చరిత్రను మళ్ళీ తిరగరాయండి..

సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించండి

బీఆర్ఎస్ పథకాలపై ప్రతి కార్యకర్త చర్చ జరపాలి

జీవన్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు

_ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత _

జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 13( ప్రజా బలం) జగిత్యాల గడ్డపై ఇక్కడి జనం చరిత్ర సృష్టించి సంజయన్నను భారీ మెజారిటీతో గెలిపించారని తిరిగి సంజయన్నను పెద్ద మెజారిటీతో గెలిపించి చరిత్రను తిరగరాయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలంలోని చల్ గల్ మామిడి మార్కెట్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి కవిత ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఇవన్నిటిపై ప్రతి కార్యకర్త గ్రామాల్లో చర్చించాలన్నారు. జగిత్యాల అంటేనే జైత్రయాత్ర గుర్తొస్తుందని ఇక్కడి ప్రజలు చరిత్ర సృష్టించి సంజయన్నను 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించి చరిత్రను తిరగరాయాలని పిలుపునిచ్చారు. సంజయన్న గెలుపు కోసం చెమట చుక్కలు చిందించిన ప్రతి జగిత్యాల బిడ్డకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల ఆత్మీయ సమ్మేళనాని కి కేవలం కార్యకర్తలనే పిలవాలని సంజయన్నను కోరానని తీరా ఇక్కడ చూస్తే ఇంతమంది కార్యకర్తల రావడంతోనే ఇక్కడ బీఆర్ ఎస్ కు ఎంత బలముందో తెలిసిపోతోందన్నారు. ఇతర పార్టీల సభలు వెలవెల పోతుంటే మన సభలు కలకళలాడుతున్నాయన్నారు. మన స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ అని 10 ఏండ్లలోనే భారత దేశంలోనే నెంబర్ 1 గా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనుడని కొనియాడారు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని కవిత కొనియాడారు. స్వాతంత్రం వచ్చిన 77 ఏండ్లలో 60 ఏండ్లు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇన్నేండ్లలో జరగని అభివృద్ధిని కేవలం 9 ఏండ్లలో సాధించుకొని 63 వేల మందికి పెన్షన్లు, 23 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రమని కవిత కొనియాడారు. ఇటీవలే 4 వేల పెన్షన్ ను వికలాంగులకు పెంచుకొన్నామని ఇలాగ ఏ రాష్ట్రంలోనూ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో 4 వేలు పెన్షన్ ఇస్తామంటూ ప్రకటించారని కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా అని కవిత ప్రశ్నించారు. కన్నతల్లికి అన్నం పెట్టానోళ్లు చిన్నమ్మకు చిరపెడతామన్న చందంగా కాంగ్రెస్ పార్టీ మాటలున్నాయని ఎద్దేవా చేశారు. ఖర్గే, రాహుల్ గాంధీ అవుట్ డేట్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఖతమయ్యిందని జాతీయస్థాయిలో బీఆర్ ఏస్సే బిజెపి కి ప్రత్నామాయమన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి చేసిందేమిలేదని యావర్ రోడ్డు విస్తరణ చేపడమంటే జీవన్ పుల్లలు పెడతాడానే భయం అందరికి ఉందన్నారు. దీనికి రమనన్న ఒక మంచి ఉపాయం చెప్పాడని హైదరాబాద్ లో వినియోగించే టీడీఆర్ తరహా జీవోను తెద్దామని చెప్పడం వెనువెంటనే జీవో రావడం జరిగిందని కవిత అన్నారు. సంజయన్న ను గెలిపించిన నాటి నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నాడని ఇప్పటి వరకు 130 కోట్ల నిధులు తెచ్చాడని 75 ఏండ్లలో జీవన్ రెడ్డి 13 కోట్లయినా తెచ్చాడా అని కవిత ప్రశ్నించారు. చివరకు మునిసిపల్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా తన మరదలునే చైర్మన్ చేశాడని అదే బీఆర్ ఎస్ పాలనలో ఒక పద్మశాలి మహిళను చైర్మన్గా చేసిన ఘనత మాదన్నారు. జీవన్ రెడ్డి మాటలు అన్ని అబడ్డలేనని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు రావడం లేదంటున్నారని 2014 కు ముందు 20వేల ఎకరాలలో వరి పండేదని ఇప్పుడు 60 వేల ఎకరాల్లో వరి పండుతోందని గుర్తుచేశారు. ఇక జీవన్ రెడ్డి మాటలు పచ్చి అబద్ధాలని 2014 లో ఇదే చివరి సారని మళ్లీ పోటీచేయనంటూ ప్రజలను వెడుకొన్నాడని గెలిపించారన్నారు. తిరిగి 2019 లో మళ్ళీ పోటీకి దిగాడాని దీనితో ప్రజలు సంజయన్నను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని కవిత చెప్పారు. నాయకుడంటే ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలని మాయ మాటలు చెప్పే జీవన్ రెడ్డిని నమ్మొద్దని కవిత కోరారు. కేసీఆర్ హైద్రాబాద్ లో అన్ని కులసంఘాలకు జాగా లు ఇస్తున్నాడని నాదృష్టికి తెచ్చాడని జగిత్యాల లో కూడా కులసంఘాలకు స్థలాలు ఇవ్వాలనుకొంటున్నాని చెప్పగా స్థలం చూసుకొండని సూచించానని కవిత చెప్పారు. అలాగే మహిళామణుల కోసం కూడా ఒక భవనం నిర్మించాలని కవిత కోరారు. గులాబీ కండువా ప్రజలకు శ్రీరామ రక్షగా ఉందని ప్రతి ఒక్కరు సంజయన్నగా మారి గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై ఇతర పార్టీల తీరుపై చర్చ పెట్టాలని కవిత కోరారు. మైనార్టీ సోదరులు జీవన్ రెడ్డి పట్ల జాగ్రర్తగా ఉండాలని తియ్యని మాటలతో మోసగిస్తాడాని కవిత అన్నారు. కేసీఆర్ దేశానికి దిక్కని మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వానికి చిక్కులు మొదలయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో బీడీ కార్మికులకు పీఎఫ్ తో జత లేకుండా పెన్షన్ కల్పిస్తామని కవిత చెప్పారు. సంజయన్న గెలిచాక అల్లిపూర్ మండలంగా చేస్తాడని కవిత చెప్పారు. రమాయణంలోని రామ రావణ యుద్ధం పై ఒక కత చెప్పిన కవిత అందులో రామ రావణ యుద్ధంలో రాముని చేతిలో రాక్షసులందరు, రావణుడు చనిపోయాడని చెప్పారు. చివరకు జాలితో రాముడు రాక్షసులందరిని బ్రతికిస్తే మా నాయకుడు లేదని జీవం పోయాలని కోరితే కలియుగంలో కాంగ్రెస్ పార్టీ అని ఒకటి వస్తుందని మీరందరూ అందులో చేరాలని దోచుకొని దాచుకోవాలని రాముడు సూచించాడని కవిత కతగా చెప్పారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని అదో డోకాబాజి పార్టీ అని కవిత అన్నారు. సంజయన్నను భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మీదేనని కవిత అన్నారు. అంతకంటే ముందు మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, జడ్పి చైర్మన్ వసంత తోపాటు పలువురు ప్రసంగించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking