మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాప్రతినిధి(ప్రజాబలం) సెప్టెంబర్ 13:ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన మ్యాడ వంశీధర్ కు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ అవార్డు దక్కింది. వాణిజ్య విభాగంలో ఓయూ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే శ్రీనివాస్ పర్యవేక్షణలో వ్యవసాయంలో కలిగే నష్టాలు మరియు నష్ట నివారణ వ్యూహాలపై రైతుల అవగాహన, ఏ స్టడీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి గ్రంథాలు సమర్పించినందుకుగాను ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా అందించింది. ఈ మేరకు వంశీధర్ ను ఓయూ ప్రొఫెసర్లు, విద్యార్థులు, స్నేహితులు అభినందించారు.