కేటీఆర్ కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు
జగ్గారెడ్డి
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నీ ఇండియా కూటమి ప్రకటించింది
. కేటీఆర్.. చిల్లర పార్టీ అని అంటున్నాడు
. కేటీఆర్ కి చెప్పదలుచుకున్న
. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా..?
. రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చాక..సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా…అప్పుడు చిల్లర అనిపించలేదా..?
. అప్పుడు అనిపించనిది ..ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది
. మీ కుటుంబం వెలిగిపోతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ కాదా..?
కాంగ్రెస్ పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లెనోడు
సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అని కేసీఆర్ సభలో చెప్పాడు.. ఆ మాట నువ్వు మర్చిపోయావా..?
కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ ఐతే.. మీ నాన్న ఆ పార్టీ నుండే కదా పాఠాలు నేర్చుకుంది
కాంగ్రెస్ థర్డ్ క్లాస్ ఐతే..మీ నాన్న కూడా థర్డ్ క్లాసే కదా..?
థర్డ్ క్లాస్ నుండే కదా..నువ్వు రాజకీయ నాయకుడివి అయ్యింది
వందకోట్ల ప్రజలకు స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అనడానికి మనసు ఎట్లా వచ్చింది
కేటీఆర్.. కాంగ్రెస్ అంటే ఏందో కేసీఆర్ నీ అడిగి తెలుసుకో
సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే .. మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం రాకుండే
అమెరికా లో జీతం మీదనే బతికే వాడివి నువ్వు
నీ కుటుంబం ఏం చేసి బతుకుతుండే నో మరి
సుదర్శన్ రెడ్డి నీ ఉప రాష్ట్రపతి అభ్యర్ధి గా పెడితే.. తెలంగాణ బిడ్డగా ఆయనకు ఓటేయాల్సింది పోయి
ఉల్టా కాంగ్రెస్ మీదనే ఆరోపణలు
. కేటీఆర్.. కేసీఆర్ వి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట
కేటీఆర్.. పదేళ్లు మంత్రిగా ఉన్న రాజకీయ మెచ్యూరిటీ రాలేదు
అందుకే మాటకు దొర్లుతున్నాడు
కేటీఆర్..బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు
కేటీఆర్..తాత..నానమ్మ బతికి ఉంటే..కేటీఆర్ ను పిలిచి తిట్టే వాడు..చెంప మీద కొట్టేవాళ్ళు
త్యాగాలకు కేటీఆర్ కి విలువ తెలియదు.
వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు
కేసీఆర్ 11 రోజులు దీక్ష చేయగలడా.?
తిని దీక్ష చేసినా.. యాక్సెప్ట్ చేసే వాళ్ళు..అప్పుడు పరిస్థితి అది
కేసీఆర్ దీక్ష అంత కాంగ్రెస్ డిజైన్
మా వాళ్ళ బాధ మా వాళ్ళది..
జానారెడ్డి ముందుండి చేశారు
తెలంగాణ వచ్చి ప్రజలకు బెనిఫిట్ ఏమైందో తెలియదు
కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం బెనిఫిట్ అయ్యింది
. కేటీఆర్ కి రాజకీయ మెచ్యూరిటీ లేదు
కేటీఆర్ తొందర పడి మాట్లాడి కిషన్ రెడ్డి కి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది
సచివాలయం లో నేను చేసిన రివ్యూ చేశా.. దానిపై %దీRూ% ఆరోపణలు చేస్తుంది
నేను ప్రతిపక్షం లో ఉన్నా.. అధికారంలో ఉన్నా మొగొన్నే
సచివాలయం లో దందా చేస్తే తప్పు కానీ.. ప్రజల కోసం సమీక్ష చేస్తే తప్పా
మళ్ళీ చేస్తా..
మీ లెక్క కొడుకు..అల్లుడు.. బిడ్డ లు పంచుకున్నట్టు పంచుకున్నానా..?
నిధులు తీసుకోవాలి కదా..
గెలుపు ఓటమి కాదు.. నేను కూడా రాజకీయ నాయకున్నే కదా..?
కిషన్ రెడ్డి మంచోడు.. సౌమ్యుడు
ప్రాబ్లం ఏంటంటే.. ఆయన కూడా స్క్రిప్ట్ లీడర్
ప్రచారక్ రాసి ఇచ్చింది చదువుతారు
పొలిటికల్ స్పీచ్ లు ఇవ్వలేడు
. యూరియా మీరు ఇవ్వకుండా .. మాట్లాడితే ఏం లాభం
.కాంగ్రెస్ నీ బదనం చేయాలని ఎరువులను అడ్డం పెట్టుకుని బీజేపీ డ్రామా ఆడుతుంది
కేంద్రమే ఇవ్వాలి యూరియా.. వేల కోట్లు రైతులకు ఇచ్చే రేవంత్ రెడ్డి కి.. ఎరువులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది ఉంటద..?
రైతుల ముసుగులో బీజేపీ..%పతీం% కార్యకర్తలు వస్తారు
. పోలీసులు లాఠీలకు పని చెప్పకండి
. రైతులకు విషయాన్ని చెప్పండి
రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తాయి
రైతులు జాగ్రత్తగా ఉండాలి
బీజేపీ %పతీం% కుట్రలు ..కుతంత్రాలు ఎక్కువ.. జాగ్రత్తగా ఉండండి