ప్రయాణం మీది భద్రత మాది

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. డయల్ యువర్ డి.ఎం. కు స్పందనఆర్టీసీ నిర్మల్ డిపో కార్యాలయంలో డయల్ యువర్ డి.ఎం.కార్యక్రమాన్ని నిర్వహించారు.
డిపోమెనేజర్ ప్రతిమరెడ్డి రెడ్డి ప్రజల నుండి వచ్చిన పిర్యాదు లు సూచనలను ఫోన్ ద్వారా స్వీకరించారు. ఫిర్యాదులు 6 సూచనలు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.
ఉదయం 08.15 ని!!లకు నిర్మల్ నుండి ఆదిలాబాద్ కు సింగిల్ స్టాప్ బస్సు కావాలని
కందుకూరు బస్సును లింగసంద్రం కు పొడిగించాలని
సోమర్ పెట్ బస్సును సమయపాలనతో నడపాలని
నిర్మల్ నుండి గొల్లమాడా మీదుగా బైంసా బస్సు నడపాలని
అబ్దుల్లాపూర్ బస్సును వయా రాయపూర్ కాండ్లీ ద్వారా నడపాలని
సముందర్ పల్లి కి నైట్ హల్ట్ బస్సును పెట్టాలని పలువురు కోరారు.
డిపోమెనేజర్ గారు సానుకూలంగా స్పందించి అడిగిన సూచనలు అమలు చేయడానికి సమయం పడుతుందని తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో సహాయ మేనేజర్ ఐ. రాజశేఖర్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking