మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 11 : మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణంలోని ఈనెల 15న ఏఫ్ సీ ఐ ఫంక్షన్ హాల్లో హైకోర్టు న్యాయవాది తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అక్కల తిరుపతి వర్మ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగ పరచుకోవాలని దండేపల్లి ఎంపిపి గడ్డం శ్రీనివాస్ అన్నారు, మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో అక్కల తిరుపతి వర్మ,ఎంపీడీవో మల్లేశంతో కలిసి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ…నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్న తిరుపతి వర్మ ను అభినందించారు సుమారు 4000 ఉద్యోగాల కు పైగా,70 కి పైన కంపెనీల ప్రతనిధులు అందుబాటులో ఉంటారని నిర్వాహకులు తిరుపతి వర్మ తెలిపారు,ఈ కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ,పెరిక సంఘం మండల అధ్యక్షుడు గడ్డం రామచందర్,టిఎ జగన్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, బిఆర్ఎస్ నాయకులు దమ్మ సునీల్,నలిమేల విజయ్, తదితరులు పాల్గొన్నారు.