సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు పోస్టు చేస్తే చర్యలు తప్పవు లక్షెట్టిపేట సీఐ కృష్ణారెడ్డి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 11 : సోషల్ మీడియా అయినటువంటి వాట్సాప్ గ్రూపులలో ఫేస్ బుక్ లో వ్యక్తి గత విషయాలు గ్రూప్లో ఎవరు పోస్టు చేసిన సంబంధిత వ్యక్తితో పాటు బాద్యత అడ్మిన్లపైనే ఉంటుందని,పోస్టు చేసిన వారిపై మరియు అడ్మిన్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మత గర్షనలు రేపే విధంగా,మహిళలను దూశించుతు లేక ఇతర వ్యక్తిగత ఆరోపణలు ఏవీ కూడా పెట్టకూడదని సూచించారు.గ్రూప్ క్రియేట్ చేసే సమయంలో పోస్ట్ పెట్టే సమయంలో,కామెంట్ పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలన్నారు. ఇతరుల మనోబావాలను బంగం కల్పించే హక్కు ఎవరికి లేదన్నారు.ప్రతీ ఒక్కరూ ఇట్టి విషయం గమనించి జాగ్రత్త వహించాలని,గ్రూప్ క్రియేటర్ ఇతరులకు గ్రూప్ అడ్మిన్ గా ఇచ్చే సమయంలో వారిని అడిగి ఇవ్వాలని గ్రూప్లో సభ్యునిగా చేర్చుకునే ముందు కూడా జాగ్రత్తగా ఆలోచించి ముందుగా చెప్పి చేర్చుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి సమాన హక్కు కల్పించిందన్న విషయం మరిపోకుండా ఎవరి పరిదిలో వారు ఉండాలని, ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోకూడదని,మత గర్షనలు,ఇతర గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉండాలని,అవసరం ఉన్న టాపిక్లపైనే ఫోకస్ చేసి పది మందికి ఉపయోగపడే పోస్టులు మాత్రమే చేసుకోవాలని సీఐ చూసించారు.సోషల్ మీడియాపై పోలీసులు నిఘా ఉంచడం జరుగుతుందని ప్రతీ గ్రూప్లో స్టేషన్ కు సంభందించి ఒక అధికారిని కూడా గ్రూప్లో ఉండే విధంగా చర్యలుతీసుకుంటున్నామన్నారు.ఎవరైన ఇట్టి విషయంలో అదిక్రమిస్తే చర్యలు తప్పవని సిఐ,ఎస్సై లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking