పోగొట్టుకున్న నగదు అప్పగించిన లక్షెట్టిపేట ఎస్సై ఎస్ లక్ష్మణ్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 10 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంకు చెందిన దిలీప్ అనే ఒక వ్యక్తి పట్టణంకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి వద్ద గుమస్తాగా పని చేస్తున్నాడు. ఈనెల 8వ తారీకున దిలీప్ వ్యాపారంలో బాగంగా కరీంనగర్ కలెక్షన్కు వెల్లి రాత్రి సమయంలో ఆర్టీసి బస్సులో లక్షెట్టిపేటకు వస్తున్నాడు.తన దగ్గర వసూలు అయిన 2లక్షల 70వేల రూపాయల నగదు ఉన్న బ్యాగ్ను తాను కూర్చున్న సీటు పైన ఉండే స్టాండ్పైపెట్టుకున్నాడు.అదే బస్సులో ఇల్లంతుకుంటకు చెందిన రాజు అనే వ్యక్తి ఆదిలాబాద్ వేల్లేందుకు కరీంనగర్లో అదే బస్సు ఎక్కాడు.రాజు తాను వెంట తెచ్చుకున్న బ్యాగులను బస్సులో స్థలం ఉన్న చోట పెట్టాడు. ఇద్దరూ ఒకే బస్సులో ప్రయాణించారు. ఇల్లంతుకుంటకు చెందిన రాజు కరీంనగర్ చౌరస్తాలో తన బ్యాగ్లను దింపుకుని తాను దిగి పోయాడు. దిలీప్ బస్టాండ్లో దిగేసమయంలో బ్యాగ్ చూసుకున్నాడు.తన బ్యాగ్ లేదు.తన బ్యాగ్ లేదని బస్సులో అందరిని విచారించాడు.అదే బస్సులో ఒక బ్యాగ్ ఉంది కానీ దానికి సంభందించి వ్యక్తి లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్సై లక్ష్మన్ ప్రత్యేకంగా ఇద్దరు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి బ్యాగ్ కోసం గాలింపు మొదలు పెట్టారు.సీసీ కెమరాల ఆదారంగా కరీంనగర్ చౌరస్తాలో దిగి రాజు బ్యాగ్లను పరీక్షించాడు. దిలీప్ బ్యాగ్ రాజు బ్యాగ్ రెండు ఒకేలా ఉండటంతో గమనించి రాజు ఉండేఊరిని తెలుసు కొని అక్కడికి వెల్లి తాను పోగొట్టుకున్న బ్యాగ్ను అందులో ఉన్న నగదును స్వాదీనం చేసుకుని బాదితులకు అప్పగించాడు. చాకచక్యంగా కేసు చేదించేందుకు కృషి చేసిన పోలీసులు బోడకుంట తిరుపతి,అంజిబాబులను ఎస్సైతో పాటు సీఐ కృష్టారెడ్డి,ఉన్నతాధికారులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking