ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జులై10:పరకాల మండలం ఎంపీడీవో ఆఫీస్ ముందు తెలంగాణ గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె 5వ రోజుకు చేరుకుంది. గ్రామపంచాయతీలో పనిచేసే సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలి అని అన్నారు.కనీస వేతనం 19,500 ఇచ్చి,ప్రమాద బీమా ఐదు లక్షలు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్మిక సంఘాల ఉద్యోగ జేఏసీ నాయకులు అధ్యక్షులు వి.ఆనందరావు,పరకాల మండల అధ్యక్షులు కోరే సంతోష్ కుమార్,ఉపాధ్యక్షులు చిలువేరు జగ్జీవన్ ,ప్రధాన కార్యదర్శి నోటంకి శ్రీనివాస్,కోశాధికారి శ్రీపతి కిరణ్,కారోబార్లు,డ్రైవర్లు,పంపు ఆపరేటర్లు,ఎలక్ట్రిషన్లు తదితరులు పాల్గొన్నారు.