68 వ సిగ్మా అకాడమీ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ కాంపిటీషన్స్ లో సర్టిఫికెట్ పొందిన సాయికృష్ణ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 10 : జూలై 2 వ తేదీనుండి 4వ తేదీలలో గోవా లోని లా గ్రేస్ రిసార్ట్ లో ఫ్యాషన్,గ్రామర్,పొట్రైట్ వివిధ విభాగాల్లో దేశీయ వ్యాప్తంగా సిగ్మా అకాడమీ ఫొటోగ్రఫీ వారు జాతీయ 68వ సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ని నిర్వహించారు. ఇందులో సుమారు 150 మందికి పైగా ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న ఫోటోగ్రాఫర్ లకు చివరి రోజున స్పాట్ కాంపిటేషన్ పోటీలు నిర్వహించారు.అందులో పోట్రైట్ విభాగంలో అందరికంటే ఎక్కువగా మార్కులు పొందిన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన సాయికృష్ణ మెరిట్ సర్టిఫికేట్ సాధించారు.ఈ సిగ్మా ఆర్ట్ ఫోటోగ్రఫీ అకాడమీ అవార్డును ను ప్రశంసా పత్రం ను అకాడమీ అధ్యక్షుడు ఎమ్ సి శేఖర్ సర్ ముంబై చీఫ్ ఫ్యాకల్టీ సునీల్ మరాతే గార్ల చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. సాయికృష్ణకి మెరిట్ సర్టిఫికేట్ సంపాదించుకున్న సందర్భంగా పోటీలో పాల్గొన్న ఫోటోగ్రాఫర్ లు మరియు పట్టణ ఫొటోగ్రాఫర్లు ప్రశంసలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking