అవసరాలకు మించి అతిగా సాన్నిహిత్యం కొరకు ప్రయత్నించ నందు వల్లే తాను నిర్భయంగాను ఆరోగ్యంగాను ఉన్నా యస్ వెంకటనారాయణ
పాత్రికేయులు అధి కారులకు
అనధికారులకు వృత్తిపరమైన
అవసరాలకు మించి అతిగా సాన్నిహిత్యం కొరకు ప్రయత్నించ నందు వల్లే తాను నిర్భయంగాను ఆరోగ్యంగాను
ఉన్నానని ప్రముఖ పాత్రికేయులు శ్రీ యస్ వెంకటనారాయణ తన ప్రసంగం లో పేర్కొన్నారు.
వయోధిక పాత్రికేయ సంఘం
నేడు ప్రెస్ క్లబ్ సోమాజీగూడ లో యేర్పాటు చేసిన “అనుభవాలు జ్ఞాపకాల ”
ప్రసంగా పరంపరలో భాగంగా
చేసిన సభలో వెంకట నారాయణ్ గారు ప్రసంగించారు.
సుదీర్ఘ కాలం జాతీయ అంతర్జాతీయ పాత్రికేయునిగా
తన జీవన యానాన్ని కొనసాగిస్తున్న శ్రీ వెంకట నారాయణ్ తన వృత్తి పరంగా
తన అనుభవాలను వివరిస్తూ
యువ పాత్రికేయులకు ఆరొగ్య కర పాత్రికేయ రచనా రంగం లో మెళకువలను స్వానుభావం తో మేళవించి ప్రసంగించారు.
సభకు సీనియర్ సంపాదకులు
శ్రీ కే రామచ౦ద్ర మూర్తి అధ్యక్ష త వహించారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మిడియా అకాడెమీ అద్యక్షులు శ్రీ అల్లం నారాయణ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. సభలో ప్రముఖ పాత్రికేయులు శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ అల్లం నారాయణ, శ్రీ ఉదయవర్లు శ్రీ వెంకట్ నారాయణ గారిని ఘనంగా సత్కరించారు. సభకు నగరంలోని ప్రముఖ పాత్రికేయులు హాజరయ్యారు ఈ సంఘం కార్యదర్శి శ్రీ లక్మణ రావు వందన సమర్పణ చేశారు.