కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పట్టణంలో మండల ఎస్సై జిపి నాయుడు ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ డ్రైవ్ ర్యాలీ నిర్వహించారు. మండల ఎస్సై జి పి నాయుడు మాట్లాడుతూ మండలంలో యువకులు మరియు ఇతరులు ఎవరైనా గంజాయ్ అలాంటివి ఎవరైనా వాడిన, చెడు వ్యసనాలకు పాల్పడిన అలాంటి వారి పైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమములు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 22 వరకు ఆంటీ డ్రగ్ డ్రైవ్ ర్యాలీలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించబడును అని తెలిపారు. ఈ కార్యక్రమము నందు మండల ఎస్సై జి పీ నాయుడు మరియు పోలీస్ సిబ్బంది, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.వెల్దుర్తి ప్రజా నేత్రన్యూస్ మౌలాలి.