ఘనంగా శ్రీ గోసే ఆలం దస్తగిరి స్వామి ఉత్సవాలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని వీరన్న కొండగట్టు దగ్గర గల శ్రీ శ్రీ శ్రీ గోసేఆ లం దస్తగిరి స్వామి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ముఖ్యంగా ఈ దస్తగిరి స్వామి చరిత్ర వీరన్న గట్టు కొండ గట్టు పైన డోన్ గ్రామానికి చెందిన రాములమ్మ అనే మహిళ కు కలలో కనబడి నేను కొండపైన నిలవ దలచుకున్నాను అని తెలియ పరచి నాడు. అప్పుడు ఆమె కొండపైనే నిత్యం పూజలు చేస్తూ భజనలు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉండేది. ఆమె మరణానంతరం వారు కుటుంబీకులు సంవత్సరానికి ఓ సారి వచ్చి పూజలు నిర్వహించి వెళ్తున్నారు గత రెండు సంవత్సరాల నుండి మక్బూల్ భాష అనే భక్తుడు స్వామివారి కృపకు పాత్రుడై అతడు స్వామి ఉత్సవాలు గంధం ,ఉరుసు, కిస్తీ కార్యక్రమాలు ఘనంగా జరిగేటట్టు మక్బూల్ భాషతో పాటు కొంత మంది భక్తులు కలిసి కృషి చేసినారు. ఈ దర్గా నందు ప్రతి గురువారము భక్తాదులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వారి సమస్యలను విన్నవించు కుంటున్నారు.అంతే కాకుండా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డిసెంబర్ 2,3, 4 వ తేదీలలో జరిగిన గంధం, ఉరుసు, కిస్తీ ఉత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలలో మక్బుల్ భాషతోపాటు జిలాల్ వలి, విజయుడు, మస్తాన్ వలి, మధు, చాంద్ భాష, నాగరాజు ,రాముడు, భక్త బృందం, తదితరులు పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking