విద్యుత్ వైర్లు తగిలి బాలుడు మృతి

కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని చిరుత పల్లి గ్రామంలో శివయ్య హోటల్ దగ్గర విద్యుత్ వైర్లు తెగి, కింద ఆడుకుంటున్న 12 సంవత్సరాల బాలుడు కచ్చేరి గంగాధర్ కుమారుడు శివ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి విద్యుత్ తీగలు క్రిందకు వేలాడుతున్న విద్యుత్ అధికారులకు తెలియజేసిన ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ బాలుడు మృతి చెందినాడు. దీనికి విద్యుత్ అధికారులదేబాధ్యత అని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కే మల్లయ్య మరియు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking