టిడిపి జిల్లా అధ్యక్షులు రాజన్న
జగిత్యాల, జనవరి 4: జగిత్యాల పట్టణ పరిధిలోని అర్హులైన నిరుపేదలనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఎంపిక చేయాలని టిడిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న కోరారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జగిత్యాల అర్బన్ డబుల్ బెడ్రుమ్ ఇండ్ల ఎంపికలో అనర్హుల ఎంపిక జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయాలని వార్డుల వారిగా కౌన్సిలర్ల ద్వారా నిరుపేదలను ఎంపిక చేసి న్యాయం చేయాలని రాజన్న కోరారు. సమగ్ర సర్వే రిపోర్ట్ ఆధారంగా ఎంపిక చేస్తే కొందరికి అన్యాయం జరుగుతుందన్నారు. జగిత్యాల నియోజకవర్గములో నిరుపేదలకు ఎన్ని ఇండ్లు కట్టించారో శ్వేత పత్రం విడుదల చేయాలని రాజన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లీ కాశీనాతం, ఓరగంటి భార్గవ్ రామ్, కోయ బాలకృష్ణ, కొండ శ్రీధర్, నక్క లక్ష్మణ్, విజయ్ కుమార్, కందుకూరి తిరుపతి, ఒరగంటి పెద్ద రాజు, ముద్ధం లక్ష్మి రాజం, జున్ను మల్లయ్య, కొండయ్య, వెంకట సుబ్బయ్య, అనిల్, రాజయ్య, రాజగంగారం
లు ఉన్నారు.