ఆసక్తికర కామెంట్స్‌ చేసిన తారక్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాన్‌ ఇండియా హిట్‌ అందుకున్నాడు. మొన్నటి వరకు తారక్‌ అంటే టాలీవుడ్‌ లో టాప్‌ హీరో.. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ తో పాన్‌ ఇండియా హిట్‌ అందుకున్నారు తారక్‌. తారక్‌ నటనకు, డాన్స్‌ లకు ప్రపంచమంతా ఫిదా అయ్యేది. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ లో రామ్‌ చరణ్‌, తారక్‌ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు గా చరణ్‌ నటించాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ కు ఎన్నో అవార్డులు వచ్చాయి. రూ. 400 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించిన ఈ ఏకంగా రూ. 1200కు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్‌ బద్దలు కొట్టింది. అంతేకాకుండా హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ తెలుగు పై డైరెక్టర్‌ రాజమౌళి పై ప్రశంసలు కురిపించేలా చేసింది. ఇక తాజాగా చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌ సొంతం చేసుకుంది.
అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ లో జరిగిన 80వ జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వేడుకలలో బెస్ట్‌ ఒరిజినల్‌.. నాన్‌ ఇంగ్లీష్‌ కేటగిరీలో ట్రిపుల్‌ ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు ఈ అవార్డ్‌ వచ్చింది. దీనిని ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇక విశ్వ వేదికపై గోల్డెన్‌ అవార్డ్‌ అందుకోవడంపై సినీ రాజకీయ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా హాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్‌ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడం పట్ల తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు.ఈ క్రమంలోనే మార్వెల్‌ ల గురించి తారక్‌ మాట్లాడుతూ.. నాకు కూడా మార్వెల్‌ చేయాలని ఉంది నా అభిమానులు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు ఐరన్‌ మాన్‌ అంటే ఇష్టం అలాంటి క్యారెక్టర్‌ మాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking