ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ జనవరి 16 హైదరాబాద్ మహానగరం లోని నిజాంపేట్ లో ‘బ్రహ్మముడి’ సీరియల్ తారాగణం సంక్రాంతి సంబరాలు అమ్బరానంటాయి.తెలుగింటి పండుగ సంక్రాంతి. లోగిళ్లలో ఆడపిల్లలు వేసే ముగ్గులు… వాటిపై అందంగా అలంకరించబడిన గొబ్బిళ్లు… హరిదాసుల కీర్తనలు… కుర్రకారును రంజిపజేసే కోడిపందాలు, గాలిపటాలు… ఎన్నో, ఎన్నెన్నో విశిష్టతలు. సంప్రదాయ వైభవానికి ప్రతీకలన్నట్లుగా ప్రతి ఇంటా సంబరాలు జరుగుతుంటాయి. ఆధునికత పేరిట ఆశలు అంతరిక్షంలో ఉన్నా, మనవైన మూలాలను గుర్తుచేసే సంక్రాంతి వస్తుందంటే సంబరాలు పండుగకు ముందుగానే ప్రారంభమైపోతుంటాయి. అచ్చ తెలుగు పల్లెల్లో కనిపించే ఈ పండుగ వైభవాన్ని సిటీజనులకు రుచి చూపడానికి స్టార్ మా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్‌ను నిజాంపెట్ లో నిర్వహించింది. నిజాంపెట్ లో నిర్వహించిన ఈ వేడుకలలో త్వరలో స్టార్‌మా లో ప్రసారం కానున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ తారాగణం సందడి చేసింది.నిజాంపెట్ వాసులతో పూర్తిగా మమేకమైన ‘బ్రహ్మముడి’ తారాగణం, వారితో కలిసి రంగవల్లులు వేశారు. గాలి పటాలను ఎగురవేయడమే కాదు, పండుగకు ముందుగానే సంక్రాంతి లక్ష్మి శోభను నగరానికి తీసుకువచ్చారు.బిగ్‌బాస్, కోయిలమ్మ ఫేమ్ మానస్, దీపిక రంగరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్‌లో బిగ్‌బాస్ ఫేమ్ హమీదా కూడా ఓ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సీరియల్ జనవరి24వ తేదీ నుంచి ప్రతి రోజూ 7.30 గంటలకు సోమవారం నుంచి శనివారం వరకూ ప్రసారం కానుంది.