కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మంలో టిఆర్ఎస్ పార్టీ సమావేశం కు అడ్డుపడతారని ఉద్దేశంతో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి ఆయా స్టేషన్ లో నిర్బదించాడం చాలా సిగ్గుచేటు..టిఆర్ఎస్ పార్టీ నిర్వహించే తలపెట్టిన సభను అడ్డుకుంటారు అనే నెపంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు ఖండించారు.బీఆర్ఎస్ నిర్వహించుకునే సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం లేకపోయినప్పటికీ అప్రజాస్వామ్య గా అర్ధరాత్రి అక్రమంగా దొంగలను అరెస్టు చేసిన విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను అరెస్టు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగుందని. ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటాలు అపేది లేదు. రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కి టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎక్స్పైరీ డేట్ ఇచ్చారని,ఖమ్మం జిల్లాలో రైతులకు సంకెళ్ళు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఉంది.రాష్ట్రంలో రైతులను మోసం చేసినట్టు దేశంలో మోసం చేయడానికి బయలుదేరారు.. పాలేరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నరని దీనిని హేయమైనా చర్యగా అభివర్ణించారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking