ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హిడ్మా హతం దృవీకరించని పోలీసులు

సుక్మా ఛత్తీస్‌ ఘడ్‌, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తుపాకులు ఘర్జించాయి. ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, బీజాపూర్‌ జిల్లా మధ్యగల దారేలి, కోమర్‌ టంగు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు నడిచాయి. ఎన్కౌంటర్‌ లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అధికారులు మాత్రం ధృవీకరించడంలేదు. ఛత్తీస్‌ ఘడ్‌ మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్ట్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌ వన్‌ కమాండర్‌ గా హిడ్మా కొనసాగుతున్నాడు. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నేత హిడ్మా లక్ష్యంగా తెలంగాణ, ఛత్తీస్‌ ఘడ్‌ రెండు రాష్ట్రాల పోలీస్‌ బలగాలు ఆపరేషన్‌ ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. 2021 సంవత్సరంలో బీజాపూర్‌ జిల్లా జొన్నలగూడ, టేకులగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కాల్పుల్లో 24 మంది జవాన్లను మృతి చెందారు.. ఈ ఘటనలో ప్రధానంగా వ్యూహరచన చేసిన హిడ్మా పోలీసులు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking