మహబూబాబాద్ గురువారం మహబూబాబాద్ పర్యటనకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసన గళం వినిపించేందుకు పలు ఆదివాసి నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, వీఆర్ ఏలు,విద్యార్థి సంఘాలు,సిద్ధం కావడంతో గూడూరు,గార్ల,చిన్న గూడూరు,కొత్తగూడ, నెల్లికుదురు, కేసముద్రం, కొరివి,మరికొన్ని మండలాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికి అక్కడ అరెస్టులు చేసారు.

గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పన ప్రకట న, పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం తోపాటు పలు హావిూల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఇప్పటికే జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీఎం పర్యటన ను అడ్డుకుంటారని నెపంతో ఎక్కడికి అక్కడ ఎవ్వరు దొరికితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి గస్తీ చేస్తున్నారు.